Ashwin’s humiliation:
టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. తనను రన్నింగ్ బస్సు లో నుంచి బైటకు తోసివేసినట్లు అనిపించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను రిటైర్మెంట్ ఆలోచన కూడా చేశానని, కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు జరిపానని, అయితే కుటుంబంతో పాటు కొంతమంది సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు ఆ ప్రయత్నం విరమించుకున్నానని చెప్పాడు.
2018-19 ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తనకెదురైన అనుభవం గురించి అశ్విన్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. ఆ సిరీస్ లో మొదటి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో మూడేసి వికెట్ల చొప్పున తీసుకొని జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించానని, కానీ ఆ సమయంలో కనీసం స్పందించని రవి శాస్త్రి, నాలుగో టెస్టులో కుల్ దీప్ యాదవ్ ఐదు వికెట్ల తో రాణించాడని, ఆ సమయంలో అతణ్ణి అకాశానికెత్తాడని, విదేశాల్లో అద్భుతంగా రాణించే ఇండియా నంబర్ వన్ స్పిన్ బౌలర్ అంటూ ప్రశంసించాడని అశ్విన్ చెప్పాడు. స్పిన్నర్ ఐదు వికెట్లు తీయడం ఖచ్చితంగా కష్టమేనని, అది గొప్ప విషయమేనని, కుల దీప్ ప్రతిభ కొనియాడదగినదేనని, అయితే ఆ వ్యాఖ్యలు తనను అవమానించే విధంగా ఉండడమే తనకు మనస్తాపం కలిగించిందని అశ్విన్ వాపోయాడు.
2018-19 లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను ఇండియా 2-0 తేడాతో గెల్చుకుని చరిత్ర సృష్టించింది. నాడు జరిగిన అనుభవాన్ని అశ్విన్ గుర్తు చేసుకొని రవి శాస్త్రితో తనకు కలిగిన వేదనను, ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.
Also Read : చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఇండియా విజయం