స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లోనూ అదరగొట్టి ఏడు వికెట్లతో వెస్టిండీస్ బ్యాటింగ్ ను కకావికలం చేయడంతో ఇండియా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి మొత్తం 12 వికెట్లు తీశాడు. ఆడిన తొలి టెస్టులోనే 171 పరుగులతో సత్తా చాటిన యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
రెండు వికెట్లకు 312 పరుగుల వద్ద నిన్న మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 5 వికెట్లకు 421 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జైశ్వాల్- 171; విరాట్ కోహ్లీ -76; రెహానే-3 రన్స్ చేసి అవుట్ కాగా, జడేజా-37; ఇషాన్ కిషన్-1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
రెండో ఇన్నింగ్స్ లో కూడా విండీస్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. జట్టులో అత్నాంజే 28 పరుగులే హయ్యస్ట్ స్కోరు కావడం గమనార్హం. జేసన్ హోల్డర్ -20 (నాటౌట్); జోమేల్ వారికాన్-18 మాత్రమే చేశారు. ఇండియా స్పిన్ ద్వయం దెబ్బకు 130 పరుగులకే విండీస్ కుప్పకూలింది.
అశ్విన్ 7; జడేజా 2; సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.