Tuesday, January 21, 2025
Homeస్పోర్ట్స్WPL: బెంగుళూరుకు తొలి విజయం

WPL: బెంగుళూరుకు తొలి విజయం

ఎట్టకేలకు విమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగుళూరు బోణీ కొట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై 5 వికెట్లతో విజయం సాధించింది. కనిక అహుజా 30 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్ తో 46; రిచా ఘోష్ 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకుంది.

నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగుళూరు బౌలింగ్ ఎంచుకుంది. యూపీ 31 పరుగులకే ఐదు వికెట్లు (కెప్టెన్ అలిస్సా హేలీ-1; దేవికా వైద్య-డకౌట్; తహిలా మెక్ గ్రాత్-2; కిరణ్ నవ్ గిరే-22; సిమ్రాన్ షేక్-2) కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రేస్ హారిస్- దీప్తి శర్మలు ఆరో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హారిస్ 32 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లతో 46; దీప్తి శర్మ 22రన్స్ చేశారు. 19.3ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

బెంగుళూరు బౌలర్లలో ఎలీస్ పెర్రీ 3; సోఫీ డివైన్, ఆశా శోభన చెరో 2;మేగాన్ స్కట్, శ్రేయంకా పాటిల్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా బెంగుళూరు తడబడింది.14  పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మందానా మరోసారి విఫలమై డకౌట్ కాగా, మరో ఓపెనర్ సోఫీ డివైన్ 14 రన్స్ మాత్రమే చేసింది. హిటర్ నైట్ (24); కనిక ఆహుజా, రిచా ఘోష్ నిలదొక్కుకొని గెలిపించారు. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

కనిక ఆహుజాకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్