Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  తెలుగు టైటాన్స్ కు తొలి విజయం

ప్రొ కబడ్డీ:  తెలుగు టైటాన్స్ కు తొలి విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు తెలుగు టైటాన్స్ ఈ సీజన్ లో తొలి విజయం నమోదు చేసింది.  మరో మ్యాచ్ లో పూణేపై హర్యానా గెలిచింది.

హర్యానా స్టీలర్స్- పునేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో37-30తో హర్యానా విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 14-14తో ఇరు జట్లూ సమంగా నిలిచాయి. కానీ రెండో అర్ధభాగంలో హర్యానా మెరుగైనా ఆట తీరు ప్రదర్శించి 23-16 తో పైచేయి సాధింఛి మ్యాచ్ పై పట్టుబిగించి విజయం సొంతం చేసుకుంది.

జైపూర్ పింక్ పాంథర్స్- తెలుగు టైటాన్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 35-34తో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో జైపూర్ 20-13 ఆధిక్యం సంపాదించింది. రెండోభాగంలో టైటాన్స్ పుంజుకుని చావో రేవో అన్నట్లుగా తలపడి 22-14 తో సత్తా చాటింది. దీనితో మ్యాచ్ ముగిసే సమయానికి ఒక్క పాయింట్ ఆధిక్యంతో ఈ సీజన్ లో తొలి విజయం నమోదు చేసుకుంది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (42 పాయింట్లు); పాట్నా పైరేట్స్ (40); బెంగుళూరు బుల్స్ (39); యూపీ యోధ (33); జైపూర్ పింక్ పాంథర్స్ (32); యూ ముంబా (31); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్