Sunday, February 23, 2025
HomeTrending News160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా

160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా

Be ready:  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అయన  జోస్యం చెప్పారు. ఎన్నికలకు  ఇంకా రెండేళ్ళ సమయం ఉంది కదా కార్యకర్తలు నిద్రపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం తెలుగు రైతు రాష్ట్ర కమిటీ వర్క్ షాప్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో  నేటినుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఈ వర్క్ షాప్ ను అచ్చెన్నాయుడు ప్రారంభించారు,

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ  ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపి 160 సీట్లు గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలో  అన్ని రంగాల్లో విఫమైన సిఎం జగన్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే జగన్ అడుగడుగునా రైతులకు అన్యాయం చేస్తునారని అచ్చెన్న ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్ కు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్