Friday, March 13, 2026
HomeTrending Newsవెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ..ఓ కన్ను కోల్పోయే ప్రమాదం

వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ..ఓ కన్ను కోల్పోయే ప్రమాదం

వివాదాస్పద రచయిత సల్మాన్ రషీద్ వెంటిలేటర్‌పై ఉన్నారని.. ఆయన మాట్లాడలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సల్మాన్ రష్దీ ఓ కన్నును కోల్పోయే ప్రమాదం ఉందని.. అతడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయని.. కాలేయం సైతం దెబ్బతిందని బుక్ ఏజెంట్ ఆండ్రూ విలే తెలిపారు. రష్దీపై న్యూయార్క్‌లో నిన్న దాడి జరిగింది. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయనపై దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో హెలికాప్టర్‌లో అతణ్ని హాస్పిటల్‌కు తరలించి ఆయన ప్రాణాలు కాపాడారు.

భారత్‌లో జన్మించిన, బ్రిటిష్ అమెరికా పౌరుడైన సల్మాన్ రష్దీ గత 20 ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. మిడ్‌నైట్స్ చిల్డ్రన్ (1981) రచనకు గానూ అతడికి బుకర్ ప్రైజ్ లభించింది. ఆయన రచించిన ది సాటానిక్ వెర్సెస్ (1988) వివాదాల్లో చిక్కుకుంది. ఇస్లాం ను కించపరిచిన రష్దీని చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. రష్దీని హత్య చేయాలని ఇరాన్ మత గురుగు ఆయతుల్లా ఖోమైనీ ముస్లింలకు పిలుపుఇచ్చారు. అతడి హత్యకు ఫత్వా సైతం జారీ చేశారు.

పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటౌక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ గురించి మాట్లాడేందుకు 75 ఏళ్ల రష్దీ.. సిద్దమవుతుండగా.. ఓ వ్యక్తి వేదికపైకి పరిగెత్తుకుంటూ వచ్చి అతడిపై దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన సభికులు రష్దీని ఆగంతకుడి నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే అతడు ఫ్లోర్ మీద పడిపోయారు. అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతణ్ని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌ అని నిర్ధారించారు. సభకు హజరైన వారిలో ఓ డాక్టర్ ఉండటంతో.. ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చేలోగా ఆయన రష్దీకి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనలో ఈవెంట్ మోడరేటర్‌ తలకు సైతం స్వల్ప గాయమైంది.

బాంబేలో ముస్లిం కశ్మీరీ కుటుంబంలో జన్మించిన రష్దీ.. అనంతరం బ్రిటన్‌కు వెళ్లిపోయారు. ఆయన రచన ‘ది సాటానిక్ వెర్సెస్’ (1988)లో దైవదూషణ ఉందని కొందరు ముస్లింలు ఆరోపించారు. చాలా ఇస్లామిక్ దేశాల్లో ఈ పుస్తకాన్ని నిషేధించారు. ఈ పుస్తకాన్ని ట్రాన్‌లేట్ చేసిన జపాన్ రచయిత హితోషి ఐగరషి 1991లో హత్యకు గురయ్యారు. ఇరాన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న సంస్థలు.. రష్దీ హత్య చేసిన వారికి మూడు మిలియన్ డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, ఇతర న్యూస్ ఔట్‌లెట్లు 2016లో ఇచ్చిన విరాళంతో రష్దీ తలకు వెలకట్టిన మొత్తం 6 లక్షల డాలర్లకు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular