Sunday, January 19, 2025
Homeసినిమాఈ సినిమాలో కొత్త నాని, సరికొత్త టైమింగ్ : నాని

ఈ సినిమాలో కొత్త నాని, సరికొత్త టైమింగ్ : నాని

Fresh subject: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ ‘అంటే సుందరానికీ‘ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగులో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో హీరో నాని మీడియాతో ”అంటే సుందరానికీ’ విశేషాలు పంచుకున్నారు. ఆ.. విశేషాలు ఆయన మాట‌ల్లోనే..

వివేక్ ఆత్రేయని కలసినప్పుడు, ఆయన కథ చెప్పినపుడు, పని చేస్తున్నపుడు ఆయన ఫ్యూచర్ టాప్ డైరెక్టర్ అనే నమ్మకం బలంగా కలుగుతుంది. ఆయన రైటింగ్ డైరెక్షన్ అంత బావుంటాయి. ప్రజంట్ లీడింగ్ దర్శకులు కంటే ఫ్యూచర్ లీడింగ్ దర్శకుల జర్నీలో భాగం కావడం ఒక ఆనందం. నేను చూసిన దర్శకుల్లో వివేక్ ఒక జెమ్. తనకంటూ ఒక ఒరిజినల్ స్టైల్ వుంది. ఇది తన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. తన సినిమా కథని ఇంకెవరికి ఇచ్చినా తన లాగా తీయలేరు. వివేక్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.

Full Meals Cinema

అంటే సుందరానికీ’లో చాలా భిన్నమైన టైమింగ్ వుంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి టైమింగ్ వున్న పాత్ర చేయలేదు. నా పాత సినిమాల డైలాగ్ టెంప్లేట్ కి ఈ సినిమా ఎక్కడా మ్యాచ్ అవ్వదు. వివేక్ అలా మ్యాచ్ కాకుండా కొత్తగా రాసుకున్నాడు. నేను పాత నానిలా చేద్దామని అనుకున్నా చేయలేని విధంగా రాసుకున్నాడు. చాలా హిలేరియస్ గా వుంటుంది. కొత్త నాని, కొత్త టైమింగ్ చూస్తారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

బ్రాహ్మణ పాత్రే కాదు కొన్ని పెక్యులర్ పాత్రలు నేపధ్యాలు ఇచ్చినపుడు కొంచెం ఎక్కువగా డ్రమటైజ్ చేయడం కనిపిస్తుంటుంది. కానీ ‘అంటే సుందరానికీ’ అలా కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. ఇందులో చాలా ప్రామాణికమైన వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న డిటేయిల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా చూస్తున్నపుడు మీరు కూడా పాత్రల మధ్యలో వున్నట్లు ఫీలౌతారు.

లీలా పాత్ర అనుకున్నపుడు నజ్రియా లా వుండే హీరోయిన్స్ ఎవరు? అనే వెదకడం మొదలుపెట్టాం. ఎవరూ కనిపించలేదు. నజ్రియా లాగా ఎందుకు నజ్రియానే అయితే ఎలా వుంటుందని భావించి ఆమెను సంప్రదించాం. అప్పటికే చాలా పెద్ద సినిమా ఆఫర్లకి కూడా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఈ కథ విన్నవెంటనే ‘నేను చేస్తా’ అని ఎగిరిగంతేసింది. లీలా పాత్రలోకి ఆమె రావడం ఆ పాత్రకు న్యాయం జరిగింది. ఫాహాద్ కూడా ఈ సినిమా గురించి చాలా ఎక్సయిటెడ్ గా వున్నారు. మొన్న కొచ్చి ప్రమోషన్స్ కి వెళ్ళినపుడు వాళ్ళ ఇంట్లోనే వున్నాం. త‌దుప‌రి చిత్రం ద‌స‌రా 25శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగులో వస్తున్న పవర్ ఫుల్ రా మూవీ ఇది అన్నారు.

Also Read : ‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం: నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్