Sunday, June 28, 2026
Homeసినిమా‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం: నాని

‘అంటే సుందరానికీ’ అనే బ్లాక్ బస్టర్ తీశాం: నాని

Trailer Out: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ “వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్ కి అల్లుడు వచ్చాడు.(నవ్వుతూ) అల్లుడు వచ్చినపుడు అల్లుడికి విందు భోజనం పెడతారు కానీ.. జూన్ 10న అల్లుడే విందు భోజనం పెడతాడు. బేసిగ్గా సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారిలా అలా కాదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి  తీసుకెళ్తారో మీ ఇష్టం. జూన్ 10నుండి ‘అంటే సుందరానికీ’ మీది. ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యుమర్, ఎమోషన్ కారణం. ఏడాది యాక్షన్ కావలసినంత దొరికింది.

హ్యుమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు. జూన్ 10 ‘అంటే సుందరానికీ’ థియేటర్ లో కావాల్సినంత హ్యుమర్, ఎమోషన్ దొరుకుతుంది. నన్ను మీ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తున్న ప్రేక్షకులకు, వైజాగ్ ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి వుంటాను. ‘అంటే సుందరానికీ’ చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ సముద్రంలాగ హ్యుమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వుంటాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తో నాకు ఇది రెండో సినిమా. ఖ‌చ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. ఈ సినిమా తర్వాత అంటే.. దీనిని మించిన సినిమా చేయాలి, చేస్తామని నమ్ముతున్నాను. ఈ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీంకి కృతజ్ఞతలు. నజ్రియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. లీల పాత్రలో తనని తప్ప ఎవరినీ ఊహించుకోలేరు. మీ అందరితో కలసి ఎప్పుడు సినిమా చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. జూన్ 10న అరిచి అరిచి, నవ్వినవ్వి మీ చొక్కాలు తడిచిపోవాలి.” చెప్పారు.

Also Read : అంటే.. సుందరానికీ’ నుంచి ‘ఎంత చిత్రం’ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular