Sunday, June 7, 2026
Homeసినిమావ‌ర్మ ‘కొండా’ ట్రైల‌ర్ విడుద‌ల‌

వ‌ర్మ ‘కొండా’ ట్రైల‌ర్ విడుద‌ల‌

Konda Coming: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన‌ తాజా చిత్రం ‘కొండా’. జీవిత చరిత్ర‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన వ‌ర్మ ఈసారి తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవితం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పృథ్వీరాజ్‌ నటించారు. ఇదివరకు ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈరోజు రెండో ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. 1990లో కారుపై జరిగిన కాల్పుల సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంత మంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి’ అంటూ ఆర్జీవీ చెప్పే డైలాగ్‌ ఇంటెన్సిటీని క్రియేట్‌ చేసింది. ‘విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్‌ మార్క్స్‌ 180 ఏళ్ల క్రితం  చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా మురళీ’ అంటూ మొదటి ట్రైలర్‌లాగానే హీరో పాత్రను పరిచయం చేశారు. ‘ఈసారి కొట్టా, చంపేస్తా, ఆలోచనలు ఉంటే సరిపోదు స్వేచ్ఛ, బానిసత్వం, మనం చేసే పోరాటల గురించి కూడా తెల్వాలే’ అనే డైలాగ్‌లు, యాక్షన్‌, లవ్ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను జూన్‌ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular