Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్The Ashes:  ఆసీస్ 339/5

The Ashes:  ఆసీస్ 339/5

యాషెస్ సిరీస్-2023 రెండో టెస్ట్ నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నేడు మొదలైంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 339పరుగులు చేసింది. తొలి వికెట్ కు 73  రన్స్ పరుగులు సాధించింది. తొలి టెస్టులో రాణించిన ఖవాజా 17 మాత్రమే చేయగా, ఆ కాసేపటికే స్కోరు 96 వద్ద మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (66) ఔటయ్యాడు.

ఈ దశలో స్టీవెన్ స్మిత్ – లబుషేన్ ను మూడో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. లబుషేన్-47 రన్స్ చేయగా,  నాలుగో వికెట్ కు స్మిత్-ట్రావిస్ హెడ్ లు 118 రన్స్ జోడించారు. హెడ్ 77 పరుగులు చేసి వెనుదిరిగాడు. అదే స్కోరు వద్ద కామెరూన్ గ్రీన్ డకౌట్ అయ్యాడు.  ఆట ముగిసే సమయానికి స్మిత్ -85;  అలెక్స్ క్యారీ -11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో జోస్ టంగ్, జో రూట్ చెరో రెండు; ఓలీ రాబిన్సన్ ఒక వికెట్ సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్