Sydney Test- Rain interrupts: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ లో తొలిరోజు ఆసీస్ 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నేడు మొదలైన ఈ మ్యాచ్ కు వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడింది. మొదటిరోజు 46.5 ఓవర్ల పాటు మాత్రమే ఆట కొనసాగింది. డేవిడ్ వార్నర్ 30 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగ్ లో జాక్ క్రాలే పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. మార్కస్ హారిస్-38; మార్నస్ లాబుస్ చేంజ్-28 పరుగులు చేశారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి స్టీవ్ స్మిత్-6; ఉస్మాన్ ఖవాజా-4 పరుగులతో క్రీజులో ఉన్నారు. జేమ్స్ అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్, మార్క్ వుడ్ తలా ఒక వికెట్ సాధించారు.
అంతకుముందు టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లూ ఒక్కో మార్పు చేశాయి. ఆసీస్ జట్టు ట్రావిస్ హెడ్ స్థానంలో ఉస్మాన్ ఖవాజా ను జట్టులో తీసుకోగా, ఇంగ్లాండ్ జట్టులో గాయంతో బాధపడుతున్న ఓలీ రాబిన్సన్ స్థానంలో స్టువార్ట్ బ్రాడ్ కు అవకాశం కల్పించారు.
ఐదు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 తో గెల్చుకున్న సంగతి తెలిసిందే.