Saturday, November 23, 2024
HomeTrending Newsఐసిసి మహిళల వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా

ఐసిసి మహిళల వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా

Australia, The Winner: ఐసిసి మహిళల వరల్డ్ కప్-2022ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 71 పరుగుల తేడాతో విజయం సాధించి ఏడోసారి ఈటోర్నీలో విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ ఓపెనర్లు హీలీ(170); హేన్స్(68), మూనీ (62) రాణించడంతో భారీ స్కోరు ఇంగ్లాండ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ విమెన్ లో స్కైవర్ మినహా మిగిలినవారు విఫలమయ్యారు.

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించి తొలి వికెట్ కు 160 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది. ఆర్. హేన్స్ 68 పరుగులు చేసి ఔటయ్యింది. రెండో వికెట్ కు హీలీ- బెత్ మూనీ లు 156 పరుగుల మరో చక్కని భాగస్వామ్యం నమోదు చేశారు. హీలీ 138 బంతుల్లో 26 ఫోర్లతో 170 పరుగులు చేసి శ్రుభ్ సోల్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన గార్డెనర్(1), కెప్టెన్ లన్నింగ్(10) లు నిరాశ పరిచారు. బెత్ మూనీ 47 బంతుల్లో  8 ఫోర్లతో 62 పరుగులు చేసి ఔటైంది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శ్రుభ్ సోల్ మూడు, ఎక్సెల్ స్టోన్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళా జట్టులో నటాలే స్కైవర్ మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. స్కైవర్ క్రీజులో నిలదొక్కుకొని ధాటిగా ఆడుతున్నా సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో అమెది ఒంటరి పోరాటం వృథాగా మిలిగింది. స్కైవర్ 121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ తో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో జేస్ జోనస్సేన్, ఆలనా కింగ్ చెరో మూడు; మేగన్ స్కట్ రెండు; తహిలా మెక్ గ్రాత్, గార్డెనర్ చెరో వికెట్ పడగొట్టారు.

అలెస్సా హేలీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద టోర్నమెంట్’ కూడా దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్