ఇండియాతో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెల్చుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే నేటి మ్యాచ్ లో ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ ను 269 పరుగులకే కట్టడి చేసినా లక్ష్య ఛేదనలో విఫలమై పరాజయం మూటగట్టుకుంది.
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తొలి వికెట్ కు 68 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ డకౌట్ కాగా… ట్రావిస్ హెడ్-33; మిచెల్ మార్ష్-47; వార్నర్-23; లబుషేన్-28; అలెక్స్ క్యారీ-38; స్టోనిస్-25; అబ్బోట్-26; అగర్-17; స్టార్క్-10; జంపా-10 పరుగులు చేశారు, 49 ఓవర్లలో 269 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది.
ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో 3; సిరాజ్, అక్షర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఇండియా తొలి వికెట్ కు 65 పరుగులు చేసింది, 17 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (37) కూడా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ-54; హార్దిక్ పాండ్యా-40; కెఎల్ రాహుల్-32; పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. చివర్లో షమీ గెలుపుపై ఆశలు రేపినా 48వ ఓవర్లో ఔట్ కావడంతో ఇండియా శిబిరంలో నిరాశ నెలకొంది. 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4; అగర్ 2; స్టోనిస్, అబ్బాట్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆడమ్ జంపాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, మిచెల్ మార్ష్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.