Australia beat Pak: ఐసిసి మహిళా వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా రెండో విజయం నమోదుచేసింది. నేడు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మౌంట్ మాంగనూయీలోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
పాకిస్తాన్ ఓపెనర్లు మరోసారి విఫలమయ్యారు. 11 పరుగుల వద్ద అమీన్ (2); నహిదా ఖాన్ (9) ఇద్దరూ ఒకేసారి ఔటయ్యారు, జట్టు స్కోరు 38 వద్ద ఒమానియా సోహైల్(12), 44 వద్ద నిదా దార్ (5) కూడా పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ మరూఫ్- అలియా రియాజ్ లు ఐదో వికెట్ కు 99 పరుగులు జోడించారు. మరూఫ్-78; రియాజ్-53తో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ రెండు; స్కట్, పెర్రీ, ఆమడ వెల్లింగ్టన్, నికోలా హారీ తలా ఒక వికెట్ సాధించారు.
ఆసీస్ మహిళలు తొలి వికెట్ కు 60 పరుగులు చేశారు. ఓపెనర్ రేచల్ హేన్స్-34 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ అలేస్సా హీలే 72, కెప్టెన్ లన్నింగ్ -35 చేయగా, పెర్రీ-26; మోనీ-23 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 34.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆస్ట్రేలియా విజయం సాధించింది. పాక్ బౌలర్లలో ఒమానియా సోహైల్ రెండు; నష్రా సంధు ఒక వికెట్ పడగొట్టారు.
అలిస్సా హీలే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.