Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్AUS-RSA: ప్రోటీస్ పై కంగారూలదే పైచేయి

AUS-RSA: ప్రోటీస్ పై కంగారూలదే పైచేయి

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టి 20 లో ఆసీస్ 8 వికెట్లతో ఘన విజయం సాధించింది.  మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది.  మూడు టి 20 లు, ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం ఆసీస్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా జరిగిన  ఈ రెండో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్-49; బావుమా-35; స్టబ్స్-27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అబ్బాట్, నాథన్ ఎల్లిస్ చెరో 3; బెహెండ్రాఫ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఆస్ట్రేలియా 32 పరుగుల వద్ద తొలి వికెట్ (ట్రావిస్ హెడ్-18) కోల్పోయింది. రెండో వికెట్ కు మాథ్యూ షార్ట్- మిచెల్ మార్ష్ లు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. షార్ట్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో  66 పరుగులు చేసి ఔట్ కాగా… 39  బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లత్హో 79  పరుగులు చేసిన మార్ష్ నాటౌట్ గా నిలిచాడు. 14.5 ఓవర్లలోనే ఆసీస్ లక్ష్యాన్ని చేరుకుంది.

అబ్బాట్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్