Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్AUS Vs SA: తొలి వన్డేలో ఆసీస్ దే విజయం

AUS Vs SA: తొలి వన్డేలో ఆసీస్ దే విజయం

సౌతాఫ్రికాతో బ్లూమ్ ఫౌంటెన్ లోని మాంగాంగ్ ఓవల్ మైదానంలో  జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ బావుమా ఒక్కడే రాణించి సెంచరీ చేశాడు. మార్కో జాన్సెన్-32; ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో 49 ఓవర్లలో222 పరుగులకు ఆలౌట్ య్యింది. ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ 3; స్టోనిస్ 2; అబ్బాట్, అగర్, జంపా, గ్రీన్ తలా ఒక వికెట్ సాధించారు.

ఆసీస్ 1 పరుగు వద్ద వార్నర్ డకౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్-33; కెప్టెన్ మిచెల్ మార్ష్-17 మినహా మిగిలిన టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ఈ సమయంలో లబు షేన్ 93 బంతుల్లో 8 ఫోర్లతో 80; అస్టాన్ అగర్-49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు 112 పరుగుల  అజేయ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం.

సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, గెరాల్డ్ చెరో 2; మార్కో జాన్సేన్, నిగిడి, కేశవ్ మహారాజ్ తలా ఒక వికెట్ సాధించారు.

లబుషేన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

సౌతాఫ్రికాలో పర్యటిస్తోన్న ఆసీస్ జట్టు మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెల్చుకొని 1-0 ఆధిక్యంలో నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్