Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్Women’s T20 WC: లంకపై ఆసీస్ అలవోకగా...

Women’s T20 WC: లంకపై ఆసీస్ అలవోకగా…

మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. లంక ఇచ్చిన 113 పరుగుల విజయ లక్ష్యాన్నిఆసీస్ వికెట్ నష్ట పోకుండా 15.5 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లు అలేస్సా హీలీ 43 బంతుల్లో 6  ఫోర్లు, 1 సిక్సర్ తో 54; బెత్ మూనీ 53 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేశారు.

జిక్వేబెర్టాలోని సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఓపెనర్లు మాధవి 34; ఆటపట్టు 16; విష్మి గుణరత్నే24; నీలాక్షి డిసిల్వా 15 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ కు పరుగులు రాబట్టడంలో లంక మహిళలు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో మేగాన్ స్కట్ 4; గ్రేస్ హారిస్ 2; ఎల్లిస్ పెర్రి, వారేహం చెరో వికెట్ పడగొట్టారు.

హీలేకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular