Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్David Warner: ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్

David Warner: ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్

స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే  వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ గెలిచిన ఆసీస్ నేడు జరిగిన మూడో మ్యాచ్ లో కూడా 221 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది.

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించారు. ఇంగ్లాండ్  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్- ట్రావిస్ హెడ్ లు సెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్ కు 269 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసి వార్నర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ హెడ్  130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో  152 పరుగులతో సత్తా చాటగా, మిచెల్ మార్ష్-30; స్టీవెన్ స్మిత్-21 పరుగులు చేశారు. నిర్దేశిత 48 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి  355 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓల్లీ  స్టోన్ నాలుగు; లియామ్ డాసన్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ లో ఓపెనర్ జేసన్ రాయ్ ఒక్కడే 32 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలింగ్ ధాటికి వరుస వికెట్లు సమర్పించుకుంది. 31.4 ఓవర్లలో 142పరుగులకే కుప్పకూలింది.ఆసీస్  బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు;  పాట్ కమ్మిన్స్, సీన్ అబ్బోర్ట్ చెరో రెండు; హాజేల్ వుడ్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ పడగొట్టారు.

ట్రావిస్ హెడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. డేవిడ్ వార్నర్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

Also Read : Australia Vs England: తొలి వన్డేలో ఆసీస్ గెలుపు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్