సౌతాఫ్రికాతో ఆ దేశంలో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. సౌతాఫ్రికా ఇచ్చిన 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ 17.5 ఓవర్లలో సాధించింది. ట్రావిస్ హెడ్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ ఇంగ్లిష్-42; స్టోనిస్-37 రన్స్ తో రాణించారు.
డర్బన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 12 పరుగులకే రెండు వికెట్లు (బావుమా-డకౌట్; బ్రీట్జ్ కె-5) కోల్పోయింది. హెండ్రిక్స్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42; కెప్టెన్ మార్ క్రమ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో రాణించగా… చివర్లో డోనోవాన్ ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్ తో 21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 48 పరుగులు రాబట్టడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో అబ్బాట్ 4; స్టోనిస్ 2; సంఘ ఒక వికెట్ పడగొట్టారు,
మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తో గెల్చుకుంది. ట్రావిస్ హెడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’; మిచెల్ మార్ష్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.
ఈ టూర్ లో భాగంగా ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. మొదటి మ్యాచ్ బ్లోయిమ్ ఫోంటీన్ లోని మంగాంగ్ ఓవల్ మైదానంలో సెప్టెంబర్ 7 న జరగనుంది.