Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్The Ashes: ఆసీస్ 295 ఆలౌట్

The Ashes: ఆసీస్ 295 ఆలౌట్

యాషెస్ లో చివరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్  295  పరుగులకే ఆలౌట్ అయి కేవలం 12  పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే సంపాదించగలిగింది.  కెన్నింగ్టన్ లో మొదలైన ఈ మ్యాచ్ లో తొలిరోజు ఆతిథ్య ఇంగ్లాండ్ 283  పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో  ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.  ఒక వికెట్ కు 61 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్… ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు కీలక భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైంది.

జట్టులో స్టీవెన్ స్మిత్-71; ఖవాజా-47; కమ్మిన్స్-36; టాడ్ మార్ఫి-34; డేవిడ్ వార్నర్-24 పరుగులు చేశారు. 295  పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ 3; స్టువార్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జో రూట్ తలా 2; జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ సాధించారు.

ఆసీస్ ఇన్నింగ్స్ పూర్తి కాగానే రెండో రోజు ఆటను ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular