Monday, March 31, 2025
Homeస్పోర్ట్స్The Ashes: ఆధిక్యంలో ఆస్ట్రేలియా

The Ashes: ఆధిక్యంలో ఆస్ట్రేలియా

లార్డ్స్ మైదానంలో జరుగుతోన్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు 278 పరుగుల వద్ద నేడు మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 47 పరుగులకే మిగిలిన ఆరు వికెట్లూ కోల్పోయింది. నిన్న 47 పరుగులతో క్రీజులో ఉన్న హ్యారీ బ్రూక్ అర్ధ సెంచరీ (50) పూర్తి కాగానే ఔటయ్యాడు. స్టోక్స్-17; బెయిర్ స్టో-16; బ్రాడ్-12 పరుగులు చేశారు.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3; ట్రావిస్ హెడ్, హాజెల్ వుడ్ చెరో 2; కమ్మిన్స్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్ తలా ఒక వికెట్ సాధించారు.

91  పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్  మూడోరోజు ఆట ముగిసే సమయానికి  రెండు  వికెట్లు కోల్పోయి 130 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్-25; లబుషేన్- 30 పరుగులు చేసి ఔట్ కాగా, ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా- 58; స్మిత్-6  పరుగులతో క్రీజులో ఉన్నారు.

మొత్తంగా ఆసీస్ 221  పరుగుల ఆదిక్యంలో నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్