Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Aus Vs WI: గెలుపు దిశగా ఆస్ట్రేలియా!

Aus Vs WI: గెలుపు దిశగా ఆస్ట్రేలియా!

వెస్టిండీస్ తో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగుతోంది. మ్యాచ్ చివరి రోజు రేపు ఏడు వికెట్లు సాధించాల్సి ఉంది.

తన రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 29 పరుగులతో నేడు నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ 48 పరుగులు చేసి అవుట్ కాగా… మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన లబుషేన్ రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించాడు. లబుషేన్-104; స్టీవెన్ స్మిత్-20 పరుగులతో క్రీజులో ఉండగా…..  లంచ్ సమయంలో కెప్టెన్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆ సమయానికి 2 వికెట్లకు 182పరుగులు చేసిన ఆసీస్  మొత్తంగా 497పరుగుల ఆధిక్యం సంపాదించింది.

వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టి మొదటి వికెట్ కు 116 పరుగులు చేసింది. త్యాగి చందర్ పాల్ 45 స్కోరు చేసి ఔట్ కాగా, షమ్రా బ్రూక్స్(11); బ్లాక్ వుడ్ (24) విఫలమయ్యారు.  మరో ఓపెనర్, కెప్టెన్ బ్రాత్ వైట్ సెంచరీ (101)తో రాణించాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. వైట్, కేల్ మేయర్స్ (0) క్రీజులో ఉన్నారు.

Also Read : Cricket T20: రికార్డులకు చేరువలో కోహ్లీ, రోహిత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్