Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్FIH Odisha Hockey: క్వార్టర్స్ కు ఆసీస్, క్రాస్ ఓవర్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్

FIH Odisha Hockey: క్వార్టర్స్ కు ఆసీస్, క్రాస్ ఓవర్స్ అర్జెంటీనా, ఫ్రాన్స్

పురుషుల ప్రపంచ కప్ హాకీ-2023లో పూల్ ‘ఏ’ నుంచి ఆస్ట్రేలియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ కు చేసుకోగా అర్జెంటీనా, ఫ్రాన్స్ లు క్రాస్ ఓవర్స్ కు చేరుకున్నాయి.

రూర్కెలా బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 9-2 తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలోనే ఆసీస్ గోల్స్ వేట మొదలు పెట్టింది. 4,10,15,19,20,22, 28, 32, 47 నిమిషాల్లో గోల్స్ చేసింది.  వీటిలో ఐదు ఫీల్డ్ గోల్స్, మూడు పెనాల్టీ కార్నర్స్, ఒక పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ ఉన్నాయి. సౌతాఫ్రికా 8,58 నిమిషాల్లో రెండు గోల్స్ మాత్రమే చేయగలిగింది.  నాలుగు గోల్స్ సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు బ్లేక్ గోవర్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య జరిగిన్ రెండో మ్యాచ్ 5-5 తో డ్రాగా ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి నిమిశంలో ఫ్రాన్స్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసి దాదాపు ఖాయం చేసుకుంది. అయితే కొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగిస్తుందన్న సమయంలో అర్జెంటీనా పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి మ్యాచ్ డ్రా చేసుకుంది. ఆట మూడవ నిమిషంలో అర్జెంటీనా బోణీ కొట్టింది. 34, 42, 51, 60 నిమిషాల్లో ఐదు గోల్స్ చేసింది. వీటిలో రెండు ఫీల్డ్ గోల్స్, మూడు పెనాల్టీ కార్నర్స్ ఉన్నాయి.

ఫ్రాన్స్ 11,36,38, 49, 60 నిమిషాల్లో ఐదు గోల్స్ చేసింది. మూడు పెనాల్టీ కార్నర్స్, రెండు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి.

ఫ్రాన్స్ కెప్టెన్ విక్టర్ చార్లెట్ కు ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్