అహ్మదాబాద్ టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. నిన్న సెంచరీ పూర్తి చేసిన ఖవాజా 180 రన్స్ చేయగా, కామెరూన్ గ్రీన్ తన కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసి 114 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అలెక్స్ క్యారీ డకౌట్ కాగా, మిచెల్ స్టార్క్ కేవలం 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. నాథన్ లయాన్-34, టాడ్ మర్ఫీ-41 పరుగులతో సత్తా చాటారు.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6; మహమ్మద్ షమి 2; అక్షర్ పటేల్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
అశ్విన్ తన టెస్ట్ కెరీర్ లో 32వ సారి ఐదు వికెట్ల హాల్ మార్క్ ను సాధించడం విశేషం.
తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా 10 ఓవర్లపాటు ఆడి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ -17; శుభ్ మన్ గిల్-18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read : యాషెస్ నాలుగో టెస్ట్ : ఇంగ్లాండ్ లక్ష్యం-388