Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్Aus W Vs. NZ W: ఆస్ట్రేలియా భారీ విజయం

Aus W Vs. NZ W: ఆస్ట్రేలియా భారీ విజయం

మహిళల టి 20 వరల్డ్ కప్ మూడో మ్యాచ్ లో న్యూ జిలాండ్ పై ఆస్ట్రేలియా 97 పరుగులతో ఘనవిజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ను ఆసీస్ బౌలర్లు 76 పరుగులకే కుప్ప కూల్చారు. ఆష్లీ గార్డ్ నర్ ఐదు వికెట్లతో  రాణించి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కించుకుంది.

పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ డకౌట్ అయ్యింది. మరో ఓపెనర్, హీలీ-55 (38 బంతులు 9 ఫోర్లు); కెప్టెన్ లన్నింగ్-41 (33 బంతులు 7 ఫోర్లు  ); ఎల్లిస్ పెర్రీ 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేయగలిగింది.

కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ర్, తుహుహు చెరో మూడు; జెస్ కెర్ర్, జెన్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.

కివీస్ వికెట్ల పతనం మొదటి ఓవర్ నుంచే ఆరంభమైంది. ఆసీస్ బౌలర్ స్కట్ వేసిన ఈ ఓవర్లోనే కివీస్ ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. జట్టులో అమేలియా కెర్ర్-21; బెర్నాడిన్-14;  జెస్ కెర్ర్-10 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆష్లీ గార్డ్ నర్ స్పిన్ కు కివీస్ బ్యాట్స్ విమెన్ దాసోహమన్నారు. 14 ఓవర్లలో 76 పరుగులకే కివీస్ ఆలౌట్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular