Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Women’s T20 WC:  సెమీస్ కు ఆస్ట్రేలియా  

Women’s T20 WC:  సెమీస్ కు ఆస్ట్రేలియా  

మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. లీగ్ దశలో మొత్తం నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి క్లీన్ స్వీప్ తో  సెమీస్ కు చేరుకున్న మొదటి జట్టు అయింది.

ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రోటీస్ మహిళలు తొలి వికెట్ కు 54 పరుగులు చేశారు. వోల్వార్ద్ట్ 19 రన్స్ సాధించి ఔట్ కాగా, మరో ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ 45; కెప్టెన్ సూనే లూస్-20; నాడిన్ డిక్లార్క్-14 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో వారేహాం-2, గార్డ్ నర్; డార్సీ బ్రౌన్, పెర్రీ, మేగాన్ స్కట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆసీస్ ప్లేయర్లు తాహిలా మెక్ గ్రాత్-57; ఆష్లీ గార్డ్ నర్-28; బెత్ మూనీ-20 పరుగులతో రాణించడంతో 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ప్రోటీస్ బౌలర్లలో మరిజాన్నే కాప్-2; మల్బా, క్లాస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

తాహిల మెక్ గ్రాత్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్