ఇండోర్ టెస్టులో ఆసీస్ 9 వికెట్లతో ఘన విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూ. టి. సి.) ఫైనల్ కు అర్హత సంపాదించింది. విజయ లక్ష్యం స్వల్పమే అయినా స్పిన్ మేజిక్ పనిచేస్తే అద్భుతం జరగొచ్చని ఇండియా క్రికెట్ అభిమానులు ఆశించినా అది నెరవేరలేదు. ఈటెస్టులో విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూ. టి. సి.) ఫైనల్లో చోటు ఖాయం చేసుకోవాలన్న టీమిండియా ఆశలు కూడా ఫలించలేదు.
76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తొలి బంతికే, పరుగుల ఖాతా తెరవక ముందే అశ్విన్ బౌలింగ్ లో కీపర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి ఖవాజా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్… లబుషేన్ తో కలిసి విజయం అందించాడు. హెడ్-49; లబుషేన్-28 పరుగులు చేశారు.
రెండు ఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
గత రెండు టెస్ట్ మ్యాచ్ ల్లాగానే ఇది కూడా మూడో రోజే ముగిసింది.
నాలుగు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతానికి ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 9న మొదలు కానుంది.
Also Read: ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్