Thursday, April 3, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై ఆసీస్ విజయం  

మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై ఆసీస్ విజయం  

ICC Women WC: ఐసిసి మహిళా వరల్డ్ కప్ మూడో మ్యాచ్ లో  ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 12 పరుగులతో విజయం సాధించింది. భారీ లక్ష్యసాధనలో ఇంగ్లాండ్ మహిళలు దూకుడుగానే ఆడినా మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చెందాల్సి వచ్చింది. హామిల్టన్ లోని సేడ్డాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ 35 పరుగుల వద్ద తొలి వికెట్ (హీలీ-28) కోల్పోయింది. అయితే రెండో వికెట్ కు హేన్స్-కెప్టెన్ లన్నింగ్ లు 196 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.  హేన్స్-130 (131 బంతులు, 14 ఫోర్లు, 1 సిక్సర్); లన్నింగ్ – 86 (110 బంతులు, 7ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. చివర్లో మూనీ-27 నాటౌట్(19 బంతులు, 3 ఫోర్లు);  పెర్రీ-14 (5బంతుల్లో  3ఫోర్లు) ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోలోయి 310 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్కైవర్ రెండు; బ్రంట్  ఒక వికెట్ సాధించారు.

బారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ లారెన్ విన్ ఫీల్డ్ డకౌట్ అయ్యింది. రెండో వికెట్ కు మరో ఓపెనర్ టామీ- కెప్టెన్ హెదర్ నైట్ లు 92 పరుగులు జోడించారు. హెదర్-40, టామీ 74  పరుగులు చేసి ఔటయ్యారు. మిడిలార్డర్ ఆటగాళ్ళు విఫలమయ్యారు. నటల్లీ  స్కైవర్ 109 పరుగులతో (85 బంతులు, 13 ఫోర్లు) అజేయంగా నిలిచింది.  ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ మూడు; తహిలా మెక్ గ్రాత్, జేస్ జోనాస్సేన్ చెరో రెండు; మేగాన్ ఒక వికెట్ పడగొట్టారు.

130 పరుగులు చేసిన రచేయిల్ హేన్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్