ఆస్ట్రేలియా-సౌత్రాఫ్రికా జట్లమధ్య జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ జట్టు 6 వికెట్లతో విజయం సాధించింది. ఇరు జట్ల బౌలర్లకూ పిచ్ అనుకూలించడంతో ఐదురోజుల మ్యాచ్ రెండో రోజుకే ముగిసింది.
మూడు టెస్టులు,మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. తొలి టెస్ట్ నిన్న బ్రిస్బేన్ లో మొదలైంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రోటీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వెర్రేఎన్-84, బావుమా-38 రన్స్ సాధించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియాన్ చెరో మూడు; కెప్టెన్ కమ్మిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు సాధించారు. నిన్న తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. రెండో రోజు లంచ్ సమయానికి ముందే 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ట్రావిస్ హెడ్-96; స్టీవెన్ స్మిత్-36 పరుగులతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో రబడ-4; మార్కో జాన్సెన్-3; నార్త్జ్-2, నిగిడి ఒక వికెట్ పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 99 పరుగులకే కుప్పకూలింది. జోండో(36); బావుమా (26) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో.. కెప్టెన్ కమ్మిన్స్-5; స్తార్క్, బొలాండ్ చెరో రెండు; లియాన్ ఒక వికెట్ సాధించారు.
విజయం కోసం కేవలం 34 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ లక్ష్యంలో కూడా సౌతాఫ్రికా బౌలర్లో 19 ఎక్స్ ట్రా పరుగులు ఇవ్వడం గమనార్హం.
ప్రోటీస్ బౌలర్లలో రాబడ ఈ నాలుగు వికెట్లూ తీశాడు.
తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగులు చేసిన ఆసీస్ బ్యాట్స్ మ్యాన్ ట్రావిస్ హెడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.