కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఈ రోజు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
19న బంద్ రోజు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యూవల్ పేరుతో రోజుకు 50 పెనాల్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.