Saturday, November 23, 2024
HomeTrending Newsమీ వైఖరి చెప్పండి: అవంతి డిమాండ్

మీ వైఖరి చెప్పండి: అవంతి డిమాండ్

విశాఖను పరిపాలనా రాజధాని  చేయడంపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టమైన వైఖరి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకువెళ్తోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఉత్తరాంధ్ర రక్షణ-చర్చా వేదికపై అవంతి స్పందించారు.

అవంతి మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:

  • టిడిపి నేతలకు ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడే హక్కు లేదు
  • అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు.
  • ఇప్పుడు చర్చావేదికలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు
  • పాలనా రాజధానిగా కొనసాగే అన్ని అర్హతలూ విశాఖకు ఉన్నాయి
  • అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుంది
  • రాష్ట్రంలో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందా? లేదా?
  • మళ్ళీ ఓ యాభై ఏళ్ళ తరువాత ప్రాంతాల వారీగా కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇది సమ్మతమేనా
  • భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య వైషమ్యాలు రాకూడదు
  • హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు
  • ఈ ఉద్దేశంతోనే మూడు రాజధానులు ప్రతిపాదన సిఎం జగన్ తెచ్చారు
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గతంలో టిడిపి అడిగింది
  • ఇప్పుడు ఈ పార్టీ  నేతలు తలోమాటా మాట్లాడుతున్నారు
  • మూడు రాజధానులపై ఓ విష్పష్టమైన వైఖరి ప్రకటించాలి
  • ఆ తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడడాం
  • విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది
  • మనబడి  నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళు బాగు చేశాం
  • ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది
  • ఇది అభివృద్ధి అంటారా లేదా అనేది టిడిపి నేతలు చెప్పాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్