Monday, February 24, 2025
Homeసినిమాఅవంతిక మిశ్రాకు వరుస ఆఫర్లు

అవంతిక మిశ్రాకు వరుస ఆఫర్లు

Avanthika Getting Series Of Offer In Tamil Industry :

మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్రా. ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో చదువుకున్న ఈ భామ తెలుగులో నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత ‘మీకు మీరే మాకు మేమే’ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ త‌ర్వాత‌ ‘మీకు మాత్రమే చెపుతా’,  ‘వైశాఖం’, ‘భీష్మ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే ఇప్పుడు తమిళ్ లోనూ అడుగుపెట్టింది. తొలి సినిమా విడుదలకు ముందే మరో రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుకుని ఆకట్టుకుంటోంది.

‘ఎన్న సొల్ల పొగరై’ అవంతిక తమిళ్ డెబ్యూ మూవీ. హరిహరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. తర్వాత కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ‘డీ బ్లాక్’ ‘నెంజమెల్లం కాదల్’ సినిమాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అయింది. మరో వైపు తెలుగులోనూ క్రేజీ ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. ఈ సందర్భంగా అవంతిక మాట్లాడుతూ..  మంచి సినిమాలు మంచి పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నటనకు ఎక్కువ అవకాశం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తమిళ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. అందుకే రెండు భాషల్లోనూ నటన కొనసాగిస్తాను. ఒక నటిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నా టార్గెట్ గా భావిస్తాను” అని చెప్పింది.

Also Read : బాలయ్య గారిలో ఓ పవర్ ఉంది : ఫైట్ మాస్ట‌ర్ శివ‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్