Sports Movie: Lakshya
నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలోరూపొందిన చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా  లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు శ‌ర్వానంద్, పుల్లెల గోపీచంద్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ వేడుక‌లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. స్పోర్ట్స్ నేపథ్యం, ఆర్చరీ సినిమా అవ్వడంతో సగం హిట్ అయింది. సినిమాకు అందరూ కష్టపడ్డారు. ఖ‌చ్చితంగా బుల్ సై కొడతారని అనిపిస్తోంది. మంచి టేస్ట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. నాగ శౌర్య ఫస్ట్ లుక్ నేనే విడుదల చేశాను. హార్డ్ వర్క్‌ తో నాగ శౌర్య తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కేతిక శర్మకు మంచి సక్సెస్ రావాలి. చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు.

హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ “జై బాలయ్య ‘అఖండ’తో ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. డైరెక్టర్‌ సంతోష్‌ గారికి విష్‌ యూ ఆల్‌ది బెస్ట్‌. మీ కష్టం కనపడుతోంది. సినిమా సక్సెస్‌ కావాలని కోరకుంటున్నాను. ఫస్ట్‌ టైం ఆర్ట్‌ డైరెక్షన్‌ చేస్తున్న లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌కు కంగ్రాట్యులేషన్స్‌, ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ప్రొడ్యూసర్స్‌ రామ్మోహన్‌రావు గారు, సునీల్‌ గారు, శరత్‌ మారార్‌ నాకు ఎంతో సన్నిహితులు. వారు నాకు పెద్దన్నల్లాగా.. ఎల్లప్పుడూ నా మంచి కోరుకునే వాళ్లు. లక్ష్య సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్‌ సినిమా చేయటానికి చాలా ధైర్యం కావాలి. చాలా స్పోర్ట్స్‌ సినిమాలు వచ్చాయి. హిట్‌ అయ్యాయి. స్పోర్ట్స్‌ సినిమా తీయాలంటే ఆ శ్రమ మొత్తం హీరోపై పడుతుంది. పాత్రకు తగ్గట్టుగా మారి నటించటానికి చాలా డెడికేషన్‌ ఉండాలి. నాగ శౌర్య డెడికేషన్‌ ఉన్న నటుడు. ట్రాన్ఫర్మేషన్‌లో కష్టం కనపడుతోంది. ఓకే ఒక్క జీవితం, ఆడవాళ్లు తర్వాత సిక్స్‌ ప్యాక్‌ అయితేనే సినిమా చేస్తా. నాగశౌర్య నాకు స్ఫూర్తి. అందరితో చక్కగా రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడతాడు. తనకంటూ ఓ మార్కెట్‌ తెచ్చుకున్నాడు. మా బాస్‌ చిరంజీవి చెప్పినట్లు తప్పకుండా నాగ‌శౌర్య‌ సూపర్‌ స్టార్‌ అవుతాడు అని అన్నారు.

నాగ శౌర్య మాట్లాడుతూ.. ఈ సినిమా కథను 2019లో విన్నాను. సునీల్ నారంగ్ గారు నాకు అన్నలాంటి వారు. ఫోన్ చేసి కథ విను అన్నారు. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా నిర్మాతలు ఈ సినిమాకు పెద్ద బలం. మా మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ అద్బుతమైన సంగీతం అందించారు. అఖండ సినిమాలో రెండు పాటలున్నాయి. మా సినిమాలో కూడా రెండు పాటలున్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు పాటలు అవసరం లేదు అని మరోసారి నిరూపించారు. కెమెరామెన్ రామ్ గారు నన్ను అద్భుతంగా చూపించారు. మా హీరోయిన్ కేతిక శర్మ ఈ సినిమాకు, మేం అనుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారు. రొమాంటిక్ సినిమాలో ఆమెను చూసి ఫిదా అయ్యాను. అది 2009 అనుకుంటాను. అప్పుడు హ్యాపీ డేస్ సినిమాను వదిలారు. శేఖర్ కమ్ముల గారి కోసం.. పద్మారావు నగర్‌‌లో ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను. కానీ ఒక్కసారి కూడా చూడలేదు. మెట్ల మీద పెన్ను, ప్యాడ్ పట్టుకుని రాసుకుంటూ ఉండేవారు. ఆ డెడికేషన్ అవసరం. పుల్లెల గోపీచంద్ గారు ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు ఎంతో కష్టపడి అక్కడ గెలిస్తే.. మేం ఇక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం.

ఇండస్ట్రీలో నాకు శర్వా బెస్ట్ ఫ్రెండ్. శర్వా భయ్యాని ఓసారి కలిశాను. అప్పుడు సినిమా కాస్త ఆడలేదు. ఏమైనా డల్‌గా ఉంటాడేమో అనుకున్నాను కానీ అలా లేడు. మనలో ఓ కన్‌సిస్టెంట్, నిజాయితీ ఉండాలని అన్నాడు. శర్వాలా అందరికీ ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. మా అందరికీ శర్వానంద్ ఇన్‌స్పిరేషన్. సక్సెస్ ఒక్కసారి వస్తుంది.. అది వచ్చే వరకు మనం ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు శర్వాకు థ్యాంక్స్ అని అన్నారు.

Also Read :  అఖండ విజయంపై మోహన్ బాబు ఆనందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *