Saturday, January 18, 2025
Homeసినిమాహిందీలో అందుబాటులోకి  వస్తున్న 'ఆవేశం' 

హిందీలో అందుబాటులోకి  వస్తున్న ‘ఆవేశం’ 

ఈ ఏడాదిలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వరుస విజయాలు నమోదవుతూ వస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్ .. ప్రేమలు .. భ్రమయుగం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేశాయి. ఆ తరువాత వచ్చిన ‘ఆవేశం’ కూడా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఫహాద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాకి, జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. శుసిన్ శ్యామ్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది.

ఏప్రిల్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, హిట్ టాక్ తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. కథాకథనాలు .. ఫహాద్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, థియేటర్స్ వైపు నుంచి 150 కోట్లకి పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అయితే మొన్నటి వరకూ మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక ఈ నెల 28వ తేదీ నుంచి హిందీ వెర్షన్ అందుబాటులోకి రానుంది.

కథలోకి వెళితే .. రంజిత్ గంగాధర్ ఓ గ్యాంగ్ స్టర్. అతనంటే ఆ ఏరియాలో అందరికీ హడల్. అతని మానసిక పరిస్థితి కొంచెం తేడాగా ఉంటుంది. అందువలన అతనికి తారసపడానికి కూడా జనాలు సందేహిస్తూ ఉంటారు. ప్రేమ .. ద్వేషం .. కోపం ఏవైనా ఎంత పరిధిలో ఉండాలనేది ఆయనకి ఎంతమాత్రం తెలియదు. ఏ విషయానికైనా అతను చాలా విపరీతంగా స్పందిస్తూ ఉంటాడు. అలాంటి అతని దగ్గరికి, కాలేజ్ లోని తమ సమస్యను పరిష్కరించమంటూ ఒక ముగ్గురు స్నేహితులు వస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేదే కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్