Wednesday, May 28, 2025
HomeTrending Newsఅయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట

అయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట

అయోధ్యలో అద్భుత ఘట్టం అవిష్కృతమైంది. వేద పండితులు బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అభిజిత్ ముహూర్తంలో వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

విల్లు బాణంతో కొలువుదీరిన రాం లల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి హారతి ఇచ్చారు. కన్నుల పండువగా జరిగిన వేడుకలకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ముకేష్ అంబాని కుటుంబం, చంద్రబాబు నాయుడు తదితర దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.  మంగళవారం నుంచి అయోధ్య రాముడు భక్త జనకోటికి దర్శనం ఇవ్వనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్