Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పది వికెట్లూ అజాజ్ కే - ఇండియా 325 ఆలౌట్

పది వికెట్లూ అజాజ్ కే – ఇండియా 325 ఆలౌట్

Azaj Patel- Record Show:
ముంబై వాంఖేడ్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న నాలుగు వికెట్లు తీసుకున్న కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ నేడు మిగిలిన ఆరు వికెట్లూ తన ఖాతాలోనే వేసుకొని మొత్తం పది వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగా చరిత్ర లో తన పేరు లిఖించుకున్నాడు.

4 వికెట్ల నష్టానికి 221 పరుగులతో నేడు రెండోరోజు ఆట ఇండియా మొదలుపెట్టింది. మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేసి ఔటయ్యాడు. సహా నిన్నటి స్కోరు (25)కు మరో రెండు మాట్రాదే జోడించి 27 పరుగులకు పెవిలియన్ చేరాడు. ఆ తరవాత అక్షర్ పటేల్ ఒక్కడే అర్ధ సెంచరీ (52) తో రాణించాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత పది వికెట్లు తీసిన బౌలర్ గా అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు.

Also Read : మయాంక్ సెంచరీ – కోహ్లీ ఔట్ వివాదాస్పదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్