Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ముదురుతున్న హెచ్.సి.ఏ.వివాదం

ముదురుతున్న హెచ్.సి.ఏ.వివాదం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ.) వివాదం కొనసాగుతూనే ఉంది. తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ ను ఎంపిక చేస్తూ అపెక్స్ కౌన్సిల్ నేడు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనోజ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం చెల్లదని, హెచ్ సి ఏకు తానే అధ్యక్షుడినని మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తానన్నారు. తనపై చర్యలు తీసుకునే అధికారం అపెక్స్ కౌన్సిల్ కు లేదని మనోజ్ నియామకం చెల్లదని, అంబుడ్స్ మెన్ నిర్ణయాలను తాను గౌరవిస్తానని వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీలో ఉంటానని తేల్చి చెప్పిన అజార్, ఐదుగురు హెచ్ సి ఏ సభ్యుల వల్లే ఈ పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్న సమావేశాలు అక్రమమని, సంస్థ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అజార్ విమర్శించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించవద్దని మనోజ్ కు అజార్ సూచించారు.

మరోవైపు కౌన్సిల్ నిర్ణయాన్ని అంబుడ్స్ మెన్ తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ కు నోటీసులు జారీ చేసింది. అధ్యక్షుడు లేకుండా, అతని ప్రమేయం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని, ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్