Monday, June 8, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సిఎం వెంటనే స్పందించారు: రమ్య తల్లి జ్యోతి

సిఎం వెంటనే స్పందించారు: రమ్య తల్లి జ్యోతి

తమ కుమార్తె, బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారని తెలిపారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు.

మా పెద్ద పాపకు జాబ్ ఇస్తానని సిఎం జగన్ చెప్పారని, ప్లాటు, పొలము కూడా ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి  మా పక్షాన ఉండి మాకు న్యాయం చేశారని ఆమె ధన్యవాడాలి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular