Saturday, March 7, 2026
HomeTrending Newsఅట్టహాసంగా ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాబుతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు వరుసగా కొణిదల పవన్ కళ్యాణ్(జనసేన), నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ (జనసేన), పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్య కుమార్ (బిజెపి), నిమ్మల రామానాయుడు, ఎన్ ఏం డి ఫరూఖ్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్థసారథి, డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్(జనసేన), గుమ్మడి సంధ్యా రాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, టిజి భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు మంత్రులుగా  ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రదానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, తమిళనాడు మాజీ సిఎం పన్నీర్ సెల్వం,  మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, నటులు రజనీకాంత్, చిరంజీవి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కేంద్ర సహాయ మంత్రులు రామదాస్ అథవాలే, అనుప్రియా పటేల్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బండి సంజయ్ కుమార్, పెమ్మసాని చంద్ర శేఖర్, బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఎన్సీపీ (అజిత్ పవార్ ) నేత ప్రఫుల్ పటేల్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జ్ సిద్దార్థ్ నాథ్, ఎంపి సిఎం రమేష్ లు వేదికపై ఆశీనులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular