చంద్రబాబు ఓ పథకం ప్రకారమే బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం పై  దాడి చేయించారని వైఎస్సార్సీపీ  ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బ్లాక్‌ డే అని….. ప్రతిరోజు పేపర్లు చింపటం, ప్లకార్డులు మొహం మీద పెట్టడం, విసిరివేయడం.. స్పీకర్‌ గారిని పదే పదే అవమానించటం వంటివి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సభాపతిపై దాడి చేయబోతే ఎమ్మెల్యే ఎలీజా అడ్డుకున్నారని, అతన్ని తోసి వేస్తుంటే తాను అడ్డుకున్నానని వివరించారు.  తనను అగ్రవర్ణానికి చెందిన బెందాళం అశోక్‌ దారుణాతిదారుణంగా తిట్టి తోసేశారని, తన చేతికి గాయమైందని దెబ్బ చూపించారు.

తక్షణమే ఆ విజువల్స్‌ను స్పీకర్‌ పరిశీలించి, దాడికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేలపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఎటూ శాసనసభకు రావట్లేదు కాబట్టి, సభ సవ్యంగా జరగకూడదని, అరాచకాలు చేసి,  గందరగోళం సృష్టించాలని  కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు రాజకీయ చరిత్ర తెల్సిన వారు ఎవరైనా.. ఇవాళ జరిగిన సంఘటన ఆయన చేయించిందే అని  స్పష్టంగా చెప్పగలుగుతారని,  వీరంజనేయస్వామి ప్లకార్డులు, పేపర్లు పట్టుకొని ప్రతిరోజు సభాపతిని అవమానించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Also Read : మోహన్ బాబు కెరియర్లో ఇది ప్రత్యేకమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *