ఇలా కూడా చేయవచ్చా? : చంద్రబాబు

Babu for Public Awareness: సినీ పరిశ్రమ సమస్యను తానే సృష్టించి మళ్ళీ తానే  పరిష్కరిస్తున్నట్లు సిఎం జగన్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ఇలాకూడా చేయవచ్చా అనే సంగతి తెలియదని విస్మయం వ్యక్తం చేశారు.  వారి కడుపు కొట్టి, భయపెట్టి లొంగదీసుకుంటున్నారని, వారు సెలేబ్రిటీలు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామని, సామాన్య ప్రజలను కూడా ఇదే తరహాలో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు మీడియా సమావేశంలోని ముఖ్యాంశాలు:

  • ఏపీలో ఆర్ధిక వ్యవస్థ, పరిస్థితులు దిగజారిపోయాయి
  • జగన్ కు సొంత లాభం తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదు
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి
  • ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే అరెస్టులు, వేధింపులు  చేస్తున్నారు
  • అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేశారు
  • ఏపీ భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది
  • ప్రతి కుటుంబంపై 5 నుంచి 6 లక్షల రూపాయల అప్పు ఉంది
  • ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారు
  • ఈ అప్పులన్నీ ఎక్కడకు వెళుతున్నాయి?  అప్పులు ఎవరు కడతారు?
  • సంపద సృష్టించకుండా ఢిల్లీ వెళ్లి అడిగితే ఇస్తారా?
  • దుర్మార్గపు ఆలోచనలతో అమరావతిని చంపేశారు
  • ఎపీకి రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది
  • చరిత్రలో ఎవరూ చేయని నష్టం రాష్ట్రానికి జగన్ చేశారు
  • రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడంలేదు
  • భూగర్భ ఖనిజ  సంపద అంతా దోచుకున్నారు
  • కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఎంపీలు ఏం సాధించారు?
  • వైసీపీ ఎంపీలు ఢిల్లీ లో అప్పుల కోసం అడుక్కుంటున్నారు
  • ఏపీలో వ్యవసాయ శాఖ లేదు, ఎత్తేశారు
  • రైతు ఆత్మహత్యల్లో ఏపీకి మూడోస్థానం
  • మా హయాంలో ఎక్కడా ఎరువుల కొరత రాలేదు
  • ఉద్యోగస్తులకోసం పోరాడడమే అశోక్ బాబు చేసిన నేరమా?
  • ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్ లో ఇంటర్మీడియట్ అనే అశోక్ బాబు పేర్కొన్నారు
  • అశోక్ బాబుపై కావాలనే కేసు పెట్టించారు
  • సాంకేతిక తప్పులను  అడ్డం పెట్టుకొని కేసు పెట్టారు
  • ఉద్యోగుల సమ్మె నోటీసు ఇచ్చిన అశోక్ బాబు సమర్ధిస్తే వెంటనే కేసు పెట్టారు
  • రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *