Sunday, January 19, 2025
HomeTrending Newsనావి ప్రజా రాజకీయాలు: బాబు

నావి ప్రజా రాజకీయాలు: బాబు

Public Politics: తాను శవ రాజకీయాలు చేయడం లేదని, ప్రజా రాజకీయాలు చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  జగన్ తో తాడో పేడో తేల్చుకుంటానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు.  కేవలం కల్తీ సారా తాగి వీరంతా చనిపోతే  ప్రభుత్వం వీటిని సహజ మరణాలని చెబుతోందని బాబు విమర్శించారు.    ఈ రోజుతో మరణించిన వారి సంఖ్య 26కు చేరుకుందని అయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొకరికీ లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికీ 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హామీ ఇచ్చారు.

మద్యపాన నిషేధం పేరుతో కొత్త కొత్త బ్రాండ్లను తీసుకు వచ్చి, కల్తీ మందు తాగించి ప్రజల మరణాలకు జగన్ ప్రభుత్వమే  కారణమని బాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని, జగన్ ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్