Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Promotions Stalled: ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తుంది. ‘ఉప్పెన’ సినిమాలో హీరో విసిరిన ‘వల’కి ఎన్ని చేపలు పడ్డాయో తెలియదుగానీ, ఈ అమ్మాయి విసిరిన చూపుల వలకి మాత్రం కుర్రాళ్ల మనసులన్నీ పడిపోయాయి. అప్పటి నుంచి ఆ వలలో నుంచి బయటికి రావడానికి ఏ మనసూ ఇష్టపడటం లేదు. అంతగా ఈ సినిమాలో ఒక చిన్నపాటి కనుసైగతో .. వెన్నలాంటి స్మైల్ తో అందరి హృదయాలను కొల్లగొట్టేసింది. ఈ సినిమా విడుదలకిముందే చకచకా అవకాశాలు రావడం చూస్తే అదృష్టం కూడా అందగత్తెల వెంటే ఉంటుందనే విషయం అర్థమైపోతుంది.

‘ఉప్పెన’ తరువాత కృతి శెట్టి చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘బంగార్రాజు’ సినిమాలు కూడా భారీ విజయాలను నమోదు చేశాయి. ఆ సినిమాల్లో ఆమె పాత్ర ఏంటి? దాని పరిధి ఎంత? అనే విషయం పక్కన పెడితే, హ్యాట్రిక్ హిట్టును కొట్టేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఇదే ఊపుతో ఈ సుందరి నుంచి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా వస్తుందని అంతా అనుకున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ – మైత్రీ వారు నిర్మించారు. సుధీర్ బాబు జోడీగా ఆమె ఈ సినిమాలో నటించింది.

ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు మంచి మార్కులు పడ్డాయి. టీజర్ .. ట్రైలర్లు కూడా అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. క్రితం నెలలో వదిలిన ‘కొత్త కొత్తగా .. ‘ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇక త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అనుకుంటూ ఉండగా సైలెంట్ అయ్యారు. బరిలో ఉన్న పెద్ద సినిమాల మధ్యలో అప్ డేట్స్ వదిలినా జనాలు పట్టించుకోరని అనుకున్నారో .. గుర్తుంచుకోరని భావించారో తెలియదు. ఆ అమ్మాయి గురించి ఇంకా చెప్పరేం? అన్నట్టుగా జనాలు ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ .. ‘ఆచార్య’ కూడా థియేటర్లకు వచ్చేసిన తరువాతగానీ ‘ఆ అమ్మాయి గురించి చెప్పరేమో!

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com