Babu Visit :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కడప జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. నేటి ఉదయం ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అయన వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్నారు. వారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు తెలుగుదేశం తరపున లక్ష రూపాయల పరిహారాన్ని, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : అవి దొంగ ఏడుపులే : రోజా వ్యాఖ్య