Thursday, April 25, 2024
Homeసినిమానాగ‌చైత‌న్య బర్త్ డే సంద‌ర్భంగా ‘థాంక్యూ’ ఫస్ట్ లుక్

నాగ‌చైత‌న్య బర్త్ డే సంద‌ర్భంగా ‘థాంక్యూ’ ఫస్ట్ లుక్

Thank You First Look:
న‌వ యువసామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య హీరోగా శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘థాంక్యూ’. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి క‌థ‌, మాట‌ల‌ను అందించారు. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్స్‌ గా న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 23)న అక్కినేని నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా థాంక్యూ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని కాస్త గ‌డ్డంతో ఉన్న అక్కినేని నాగ‌చైత‌న్య తిరునాళ్ల‌లోని తిరిగే రంగుల రాట్నంలోని గుర్రం పై ఎక్కి కూర్చుని తిరుగుతూ సంతోష ప‌డుతున్నాడు.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ “నాగచైత‌న్య పుట్టినరోజు సందర్భంగా మా ‘థాంక్యూ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్ప‌టివ‌రకు నాగ‌చైత‌న్య చేయన‌టువంటి ఓ వైవిధ్య‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు. యాక్ట‌ర్‌గా ఆయ‌నలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే చిత్ర‌మని ఖ‌చ్చితంగా, న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. బి.వి.ఎస్‌.ర‌వి అందించిన అద్భ‌తుమైన క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్‌ మ‌రింత గొప్ప‌గా మ‌లిచారు. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్, ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ , ఎడిట‌ర్ న‌వీన్ నూలి… ఇలా ఓ బెస్ట్ సినిమాను అందించ‌డానికి బెస్ట్ టీమ్ వ‌ర్క్ చేసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం” అన్నారు.

Also Read : ‘బంగార్రాజు’ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్