Tuesday, April 16, 2024
HomeTrending NewsRK Roja: బాబు ఇచ్చినవి కాపీ హామీలు: రోజా విమర్శ

RK Roja: బాబు ఇచ్చినవి కాపీ హామీలు: రోజా విమర్శ

‘చంద్రబాబు పిట్ట కథలకు, పచ్చ చానెళ్ళ కట్టు కథలకు పుట్టిన విషపుత్రిక…టిడిపి నిన్న విడుదల చేసిన ఛార్జ్ షీట్’ అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. ఈ ఛార్జ్ షీట్ బాబు పిచ్చికి పరాకాష్ట అన్నారు. తిరుపతిలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.  సిఎం జగన్ తన నాలుగేళ్ల పాలనలో నాలుగు తరాలు గుర్తు పెట్టుకునేలా అభివృద్ధి, సంక్షేమం అందించారని కొనియాడారు. సంక్షేమం, సుస్థిరత, సాధికారత, సమ్మిళిత అభివృద్ధి దిశలో పాలన సాగిందన్నారు.

గతంలో 600పైగా హామీలు ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చాక ఆరు హామీలు కూడా అమలు చేయలేదని,  కానీ నాలుగేళ్ల పాలనలోనే 98.5శాతం హామీలను సిఎం జగన్ నెరవేరిస్తే..  తమ పాలనను మోసపూరితం అని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

2014లో బాబు సిఎం కాగానే నాలుగు ప్రధాన హామీలు.. రైతు రుణమాఫీ, మహిళా సంఘాల రుణాల మాఫీ, బెల్టు షాపుల రద్దు, రెండు రూపాయలకే 20లీటర్ల మినరల్ వాటర్ హామీలపై సంతకాలు చేశారని, కానీ వీటిలో ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. మోసాలకు గడ్డం మీసాలు పెడితే అది చంద్రబాబు అని, ఐదేళ్లపాటు పచ్చ చానెళ్ళను అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేశారని రోజా నిప్పులు చెరిగారు.

మొన్న మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసపూరితమని రోజా అన్నారు. గతంలో యువతకు నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఇచ్చారని, కానీ జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షా 30వేల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారని, దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. రైతులకు మేలు చేసింది నాడు వైఎస్సార్, నేడు జగన్ మాత్రమేనని, బాబు 20వేలు ఇస్తానంటే వారు నమ్మరని ఎద్దేవా చేశారు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సొంతంగా మేనిఫెస్టో కూడా రూపొందించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని హేళన చేశారు. ఆరు హామీలిస్తే మూడు జగన్ చెప్పిన వాటిని, రెండు కర్ణాటక కాంగ్రెస్…మరొకటి కర్ణాటక  బిజెపి నుంచి కాపీ కొట్టారన్నారు. గతంలో అమ్మఒడిపై ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్ర‌బాబు.. ఇప్పుడు అమ్మ‌కు వంద‌నం అంటున్నారని రోజా  విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్