Sunday, January 19, 2025
HomeTrending Newsభరత్ ను మంత్రిని చేస్తా: జగన్ హామీ

భరత్ ను మంత్రిని చేస్తా: జగన్ హామీ

కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్ళపాటు ఎమ్మెల్యేగా పనిచేస్తూ, 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబునాయుడు కనీసం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. సొంత నియోజకవర్గానికే ఏ ప్రయోజనం చేయలేని ఈ పెద్దమనిషి వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీటిని సిఎం జగన్ నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా శాంతిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

* కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కృష్ణాజలాలు తరలిస్తామని 2022, సెప్టెంబర్ 23న ఇదే  నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో మాటిచ్చాను.
* ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నా.
* దీనితో పాటు మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజీ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.
* దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి.
* గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరో రిజర్వాయర్ ను 535 కోట్లతో నిర్మించడానికి, అదనంగా దీని వల్ల మరో 5 వేల ఎకరాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


* ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు పాలారు ప్రాజెక్టుకు సంబంధించి .6 టీఎంసీల కెపాసిటీతో చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్లతో కట్టడానికి కూడా పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.
* దాదాపు 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కుప్పం నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి.
* ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జలవనరుల శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపిన చంద్రబాబు.. అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు.
* 561 కోట్లకు పెంచుకుంటూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వారికి, బినామీలకు పనులు అప్పజెప్పాడు.
* 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తిచేయకపోగా, లాభాలు వచ్చే పనులు మాత్రమేచేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అస్మదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్ములు ఇచ్చాడు
* కుప్పం, పలమనేరులో 4 లక్షల ప్రజలకు నీరందే కాలవ కాకుండా బాబు జేబులోకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గాన్ని కూడా ఉపయోగపెట్టుకున్నాడంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా?

* ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న నాయకుడిని, దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు చెబుతున్నా.
* ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగిందో ఆలోచన చేయాలి.
* 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ, 14 సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా? ఆలోచన చేయాలి.
* కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్
* కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్
* కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్
* కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీజగన్
* చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా అమూల్ ను తీసుకొచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్.
* కుప్పం ప్రజలు చంద్రబాబుకు 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో నిలదీయాల్సిన అవసరం ఉంది.
* సొంత నియోజకవర్గానికే మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగుతున్నాడు.


* పొత్తులెందుకు అని అడిగితే మాట్లాడడు. మీ పేరు చెబితే ఒక్క మంచైనా ఉందా? ఒక్క స్కీమైనా ఉందా అని అడిగితే మాట్లాడడు.
* ఏ గ్రామం మధ్య అయినా నిలబడి ఈ గ్రామంలో నా మార్క్ ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అదీ మాట్లాడడు.
* సామాజికవర్గాలకు మీరు చేసిన న్యాయం ఏంటని అడిగితే చివరకు కుప్పంలో కూడా బీసీ ఎమ్మెల్యేను పెట్టని తీరు చూస్తే సామాజిక న్యాయం ఎక్కడ చేశారని అడిగితే అదీ మాట్లాడడు.
* కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవడం బాబు మార్క్ రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబుమీద గెలవలేక పోయినా కూడా మీలో ఒకరిని, బలహీనవర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేసి, అతడిని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ మంచి చేయడం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* భరత్ ను, మన బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి 5 సంవత్సరాల్లో మంచి చేశాం.
* భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని మాట ఇస్తున్నా.
* ఏ మార్క్ రాజకీయం కావాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
* ప్రజల గురించి, పేద వాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా? లేకపోతే ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలికి వదిలేసే రాజకీయం చంద్రబాబు చేస్తున్నది కావాలా?

* 14 సంవత్సరాలు తాను చేసింది ఏంటంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడు.
* ఏరోజైనా ఏ మంచీ చేయని ఈ వ్యక్తి రంగు రంగుల మేనిఫెస్టోతో ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నాడో ఈ వ్యక్తిని నమ్మగలమా.
* 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం చూశారు. ప్రతి ఇంటికీ జరిగిన మంచి చూశారు. పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడుతున్న తాపత్రయం చూశారు.
* మీ బిడ్డను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదవాడి బతుకు బాగుపడుతుంది. పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది.
* మీలో ప్రతి ఒక్కరూ మంచి జరిగిన ప్రతి విషయం కూడా ఇంకో వంద మందితో చెప్పి ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ పూనుకోవాలని విన్నవిస్తున్నా.

అంటూ సిఎం జగన్ శాంతిపురం సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్