పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కార్యదర్శి చిన్నా అచ్చెన్న హత్య కేసులో దోషులను శిక్షించి తీరుతామని వైఎస్సార్సీపీ ఎంపీ  నందిగం సురేష్ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసిందని, కానీ విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దీన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. డ్యూటీలు వేసే విషయంలో వారిమధ్య నెలకొన్న వివాదం ఈ సంఘటనకు కారణమని ప్రాథమికంగా తేలిందన్నారు. ఇప్పటికే హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలు చెందిన పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

అచ్చెన్న కుటుంబానికి తగు న్యాయం చేస్తామని, ప్రభుత్వం తరఫున ఏమి చేయగలమో అంతా చేసి వారిని ఆదుకుంతామని హామీ ఇచ్చారు.  ఈ ఘటనను బూచిగా చూపి దళితులపై చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తున్నారని, ఎస్సీలు, ఎస్టీలపై వివక్ష ప్రదర్శిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు  వక్రీకరిస్తున్నారని సురేష్ విమర్శించారు. అసలు దళితులపై వివక్ష మొదలు పెట్టిందే చంద్రబాబు అని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అంటూ వ్యాఖ్యానించిన ఆయన ఇంతవరకూ దానిపై క్షమాపణ కూడా చెప్పలేదని నందిగం సురేష్ మండిపడ్డారు.  ఎస్సీల గురించి మాట్లాడే అర్హత బాబుకు, ఎల్లో మీడియాకు లేదని ఆయన పేర్కొన్నారు.

Also Read : Meruga Nagarjuna: నీ గురించి అలోచించే సమయం లేదు: మేరుగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *