ఓటమి భయంతోనే బాబు టూర్: పెద్దిరెడ్డి

Babu in Frustration:  ఓటమి భయంతోనే చంద్రబాబు తరచూ కుప్పంలో పర్యటిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కేవలం ఎన్నికలప్పుడు లేదా ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేవారని, ఇప్పుడు గ్రామాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కుప్పంలోని ఎన్నో గ్రామాల్లో అయన కనీసం ఒక్కసారి కూడా పర్యటించలేదన్నారు. చంద్రబాబు కుప్పం బాట పట్టడం తాము సాధించిన నైతిక విజయం, చంద్రబాబు పతనంగా పెద్దిరెడ్డి అభివర్ణించారు.  పులిచర్ల మండలంలో రెండవ రోజు పల్లెబాట కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలు వింటూ, వాటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో బాబు పర్యటనపై వ్యంగాస్త్రాలు సంధించారు.

చేసిన పనులు చెప్పుకోలేని పరిస్థితుల్లో బాబు ఉన్నారని, అయన తలకిందులుగా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో ఆయన్ను కుప్పంలో ఓడించి తీరుతామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిరాశా నిస్పృహలతోనే సిఎం జగన్ పై బాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ పాలనపై ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, మళ్ళీ మళ్ళీ సిఎంగా జగన్ నే గెలిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారని పెద్దిరెడ్డి వెల్లడించారు.

Also Read : కుప్పం వదిలిపెట్టను: బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *