Thursday, April 25, 2024
HomeTrending Newsవెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ బాబు: జగన్

వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్ బాబు: జగన్

‘మీ ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్, కుప్పం కు నాన్ లోకల్’ అని చంద్రబాబును ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఈ నియోజకవర్గానికి ఏం చేశాడో తెలియదు కానీ ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉంద’న్నారు. బాబు 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ ఇక్కడి ప్రజలకు ఏమి కావాలో ఆలోచించిన పాపాన పోలేదని, 14 ఏళ్ళు సిఎం గాఉన్న అయన ఇక్కడి కరువును కూడా పారద్రోలలేకపోయారని విమర్శించారు. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు…  చివరకు కుప్పంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితికూడా  తీసుకురాలేక పోయారన్నారు. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా ఒక్కటే పరిష్కారం అని తెలిసి కూడా ఇది పూర్తి చేస్తే ఇక్కడి ప్రజలు తన మాట వినరనే భయంతోనే పూర్తి చేయలేదన్నారు. ‘వైఎస్సార్ చేయూత’ మూడో విడత పంపిణీలో భాగంగా కుప్పంలో ఏర్పాటైన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బాబుకు ఇక్కడ సొంత ఇళ్లు కూడా లేదని, కనీసం ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. కుప్పం తన సొంతం అని అయన ఎప్పుడూ భావించలేదన్నారు. క్రిష్ణగిరి నుంచి పలమనేరు హైవే కు లింక్ ఇస్తానని హామీ ఇచ్చి వదిలేశారని, కుప్పం టౌన్ లో కనీసం డబుల్ రోడ్ కూడా వేయలేకపోయారన్నారు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం కుప్పంలో విమానాశ్రయం అంటూ మభ్యపెట్టారని సిఎం ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గంలో కనీసం నిరుద్యోగ సమస్యను కూడా తీర్చలేదని, నిత్యం 5వేల మంది ఇక్కడి నుంచి చెన్నై, బెంగుళూరు ఉపాధి కోసం వెళుతున్నారని అన్నారు. కుప్పం ను ఒక రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేదని, దానికోసం తనకు లేఖ రాశారని గుర్తు చేశారు.  ఇంతకంటే చేతగాని నాయకుడు ఎవరైనా ఉంటారా అనేది ఇక్కడ ఉన్న ప్రజలు ఆలోచించాలన్నారు. దీన్ని చేతగానితనం అనాలా, చేయకూడదన్న దుర్భుద్ది అనాలా అని ప్రశ్నించారు.  ఎన్నికలప్పుడు దొంగ ఓట్లు వేయించుకుంటారని….  వెన్నుపోటుకు, దొంగ ఓటుకు గత 30 ఏళ్ళుగా కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని పేర్కొన్నారు.

కానీ ఇక్కడి ప్రజలు మోసానికి, అన్యాయానికీ తలవంచేదే లేదని చెప్పి… అభివృద్ధి వైపు చూస్తే ఎలా ఉంటుందో  స్థానిక ఎన్నికల్లో చూపించారన్నారు. అన్నింటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా గెలిపించారని అన్నారు. కుప్పంలో ప్రజలు DBTకి ఓటు వేశారని వివరించారు.  తన మూడేళ్ళ హయాంలో కుప్పం అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు జగన్.  భరత్ ఎమ్మెల్సీగా ఉంటేనే ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయగలుగుతున్నారని, రేపు ఇక్కడి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మంత్రిగా చేస్తానని ప్రకటించారు.

Also Read : జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్